
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఎల్.ఐ.కె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)’. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్. ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఒటిటి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ మే నెల 6వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. సోషల్‌మీడియాలోఈ వివరాలను ప్రకటిస్తూ సదరు ఒటిటి సంస్థ పోస్టర్‌ని విడుదల చేసింది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ లవ్‌స్టోరీని తనదైన శైలీ కామెడీని టచ్ చేస్తూ.. ఈ సినిమాను తరకెక్కించాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఎస్.జె సూర్య విలన్‌గా నటించారు.












