
తమిళనాడు సిఎం విజయ్ సంచలన నిర్ణయం
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ప్రార్ధనా మందిరాలు, పాఠశాలల వద్ద మద్యం దుకాణాలు మూసివేయాలని ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. దీనిపై ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు , పాఠశాలలు, కళాశాలలతో పాటు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని పేర్కొంది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ( టిఎఎస్ఎంఎసి) ఆధ్వర్యంలో నడుస్తున్న వాటన్నింటినీ రెండు వారాల్లోగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4765 మద్యం రిటైల్ దుకాణాలు టిఎఎస్ఎంఎంసి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. తాజాగా మూసివేయడానికి గుర్తించిన 717 దుకాణాల్లో, 276 ప్రార్థనా స్థలాల సమీపంలో , 186 విద్యాసంస్థలు, మరో 255 బస్స్టాండ్ల సమీపంలో ఉన్నాయి. సీఎం విజయ్ తాజా ఆదేశాలతో మరికొన్ని రోజుల్లో ఇవి మూతపడనున్నాయి.














