
వచ్చే సండత్సరం 2027కు పద్మ పురస్కారాలకు దరఖాస్తుల నామినేషన్ల ప్రక్రియ ఆరంభం అయింది. నామినేషన్, సిఫార్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటన వెలువరించింది. ఈ ఏడాది జులై 31వ తేదీలోగా పౌరులు తమ నామినేషన్‌ను పంపించుకోవచ్చు. కళా, సాంస్కృతిక సాహిత్య రంగాలు, సామాజిక శాస్త్ర సాంకేతిక , క్రీడా, విద్యా, వైద్య, ప్రజా వ్యవహారాలు , వ్యాపార వాణిజ్య రంగాలు, వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి ఎవరైనా తమ పేర్లను పద్మ పురస్కారాల కోసం నేరుగా పంపించుకోవచ్చు.
అంతేకాకుండా విశిష్టుల పేర్లను ఇతరులు ప్రతిపాదించవచ్చు. ఈ ప్రతిపాదనలను కేవలం ఆన్‌లైన్‌లోనే రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in ) వేదికకు చేరవేయవచ్చునని అధికారిక ప్రకటనలో తెలిపారు. పద్మశ్రీ, అత్యున్నత పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, అవార్డుల ఎంపిక ప్రక్రియ 1954లో ఆరంభం అయింది. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఈ పౌర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడుతుంది.












