హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఎస్‌ఎస్‌సి బోర్డ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 5,17,760 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 5,16,534 మంది(99.76 శాతం) హాజరయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మార్కుల మెమోను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. పరీక్ష ఫలితాల కోసం కింద క్లిక్ చేయండి. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొంటారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది.  పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే, ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థులకు త్వరగా ఫలితాలను అందించాలనే ఉద్దేశంతో పరీక్షలు పూర్తికాకముందే ఈనెల 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి