మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బర్గి డ్యామ్ వద్ద ఒక క్రూయిజ్ పడవ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఎడుగురు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులు వీచడంతో నదిలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. దీంతో పడవ నియంత్రణ కోల్పోయి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో దాదాపు 35 నుండి 40 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.సుమారు 15 నుంచి 18 మంది వరకు నీటిలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన గురించి తెలిసిన వెంటనే ఎస్డీఆర్‌‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు రంగంలోకి దిగాయి. 18 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు.గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.