
కర్ణాటకలో దేవనహళ్లిలోని దారుణం చోటు చేసుకుంది. ఓ 19 ఏళ్ల యువతి టాయ్‌లెట్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. ఆ బిడ్డ పీక కోసి చంపేసి ఓ సంచిలో పడేసింది. ఫాక్స్‌కాన్ సంస్థకు చెందిన తయారీ ప్లాంటులో ఈ దారుణం జరిగింది.
ఆ యువతికి వివాహం కాలేదని.. ఈ విషయం తెలిస్తే ఎక్కడ పరువుపోతుందనే భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రోజు డెలివరీ అవుతుందని ఆమె ఊహించకపోయి ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తరువాత మరొకరు వాష్‌రూంలోకి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. బిడ్డ పుట్టిన వెంటనే చంపేసినట్లు గుర్తించారు. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ యువతికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.



