పంజాగుట్ట: హైదరాబాద్ లోని పంజాగుట్టలో పట్టపగలే రూ. 15 లక్షల బ్యాగు చోరీకి గురైంది. అఫ్షద్ అనే వ్యక్తి పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి పంజాగుట్టలోని బ్యాంకు కు వచ్చాడు. పంజగుట్ట ఫ్లై ఓవర్ వద్ద గణేష్ స్టాంప్స్ అండ్ కో వద్ద బ్యాగును కుర్చీలో పెట్టి అఫ్షద్ కూర్చున్నాడు. చూస్తుండగానే రూ.15 లక్షల బ్యాగ్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. వెంటనే అప్షద్  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.