
అమరావతి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 18 నెలల పసికందును ప్రియుడు గోడకేసి కొట్టి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని గన్నవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గన్నవరానికి చెందిన యువకుడు, వాంబేకాలనీ చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఐదు సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2025 జనవరిలో ఓ పాప జన్మించింది. భర్త స్నేహితుడు కనిజం వంశీతో యువతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి పలుమార్లు వంశీతో కలిసి సహజీవనం చేస్తుంది. పసి పాపతో కలిసి ఒక రోజు వంశీ గదికి వెళ్లిన క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. 18 నెలల పాపను ప్రియుడు వంశీ దారుణంగా గోడకేసి కొట్టి చంపాడు.
పాప ఘటనా స్థలంలోనే చనిపోవడంతో అత్తామామలకు జరిగిన విషయం ఫోన్ లో చెప్పింది. ఎక్కడున్నావని వారు అడగగా, మహిళ పొంతన లేని సమాధానం చెప్పడంతో అత్తామామలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలించారు. చుట్టుగుంట సమీపంలో చనిపోయిన పాపతో నిందితులను పోలీసులకు పట్టుకున్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడంతో పాపను హతమార్చినట్లు పోలీసులు విచారణలో తేలింది. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే వంశీ గతంలో పోక్సో కేసులో రెండు నెలలు జైల్లో ఉన్నాడని, అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.









