మహారాష్ట్రలోని పుణే వద్ద ముంబై షోలాపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం రాత్రి 7.30 ప్రాంతంలో ఈ ప్రీమియం ఏసి టైన్ నెంబరు 22225 పట్టాలు తప్పడంతో కలకలం చెలరేగింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అదికారులు తెలిపారు. పుణే రైల్వేస్టేషన్‌లోకి చేరుకునే దశలో కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ రైలు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సిఎస్‌ఎంటి) నుంచి షోలాపూర్‌కు వెళ్లుతుండగా ప్రధానమైన పుణే స్టేషన్‌లో పట్టాలు తప్పింది. రైలులో ఓ బోగీ చక్రాలు డైమండ్ క్రాసింగ్ వద్ద పక్కకు జరిగాయని గుర్తించారు.