
రణ్‌వీర్ సింగ్ హీరోగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. 2025 డిసెంబర్‌లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. విడుదలైన మొదటి షో నుంచి సూపర్‌హిట్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్ల పరంగా కూడా కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాను థియేటర్లలో చూడని వాళ్లు ఒటిటిలోకి వస్తే చూసేద్దామని ఎదురు చూస్తున్నారు. తాజాగా ధురంధర్-2 ఒటిటి రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమా మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇది కేవలం ఓవర్‌సీస్‌లో మాత్రమే. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 52 నిమిషాలుగా ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. అయితే భారత్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి ఇప్పటికైతే సమాచారం లేదు. అయితే మే 15 నుంచి ఈ సినిమా ఇండియాలో ప్రసారం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై ఇంకా జియో హట్‌స్టార్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














