నవతెలంగాణ- హైదరాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. టెర్మినల్ లోపల, ప్రయాణికుల లగేజీలో బాంబులు అమర్చినట్లు వచ్చిన ఈ-మెయిల్‌తో CISF, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో విమానాశ్రయం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీని పూర్తిగా పరిశీలిస్తూ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం.
The post రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు appeared first on Navatelangana.













