ఐదుగురు మహిళలతో సముద్రాన్ని ఈది తొలి రికార్డు

మన తెలంగాణ/కాచిగూడ : హైదరాబాద్ నగరంలోని బర్కత్ పురాకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా (45) మరో రికార్డును నెలకొల్పారు. శ్రీలంకలోని తలైమీనార్ నుంచి తమిళనాడు రామేశ్వరం ధనుస్కోడి వరకు ఐదుగురు మహిళలతో సముద్రాన్ని ఈది తొలి రికార్డు నమోదు చేసుకున్నారు. యూనిఫ్లై సంస్థ ఆర్థిక సహకారంతో స్విమ్ఎఫ్ సహకారంతో ఓడబ్ల్యూఎస్ఎఫ్ ఉపా ధ్యక్షుడు సతీష్ కుమార్ మాట అబ్జర్వేషన్ లో ఐదుగురు మహిళ లు ఈ రికార్డును నెలకొల్పారు. బర్కత్ పురకు చెందిన గంధం క్వీనీ విక్టోరియా సారధ్యంలో న్యూఢిల్లీకి చెందిన ఆర్సీ (42), తెలంగాణకు చెందిన మౌనిక (34), మహారాష్ట్రకు చెందిన స్మిత (52), ఏపీ విజయవాడకు చెందిన ధాత్రిక మండవ (48) ఐదుగురు మహిళలు శ్రీలంకలోని తలైమినార్ లో ఆదివారం తెల్లవారుజామున రెం డు గంటలకు స్విమ్మింగ్ ప్రారంభించి రామేశ్వరం ధనుస్కోడికి మధ్యాహ్నం 12.10 నిమిషాలకు చేరుకున్నారు. ౫౯ కిలోమీటర్ల దూ రాన్ని 10గంటల 10 నిమిషాలలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. ఐదుగురు మహిళలు కలిసి రామసేతువును ఈదడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా గంధం క్వీనీ విక్టోరి యా మాట్లాడుతూ...యువత డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశ నం చేసుకుంటున్నారని, డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్న నినాదంతో రామసేతువును ఈది రికార్డు నెలకొల్పామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ధనుస్కోడిలో పలువురు ఈ ఐదుగురు మహిళలను అభినందించారు.