
రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం(మే 13) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 889 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 3,98,358 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2,67,285 మంది, రెండో సంవత్సరం ప్రైవేట్ విద్యార్థులు 1,31,073 మంది హాజరుకానున్నారు.












