మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి లేనంతగా సిఎం, హోంమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు తెలంగాణ మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. సైబర్ నేరాల్లో కూడా టాప్‌లో ఉందని ట్విట్టర్ (ఎక్స్)లో కెటిఆర్ పేర్కొన్నారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరడం విశేషమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ మహిళలపై నేరాల రేటులో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, సైబర్ నేరాలు కూడా భారీగానే పెరిగాయని ఆయన విమర్శించారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సిఎం రేవంత్ రెడ్డి అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఏడిఆర్) ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా కెటిఆర్ ప్రస్తావించారు.