మన తెలంగాణ/హైదరాబా ద్: రిజిస్ట్రేషన్లకు భారీగా డి మాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా ప్రత్యేక ఏ ర్పాట్లు చేయాలని అధికారులను రెవెన్యూ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కోసం కా ర్యాలయాలకు వచ్చే ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. అధిక రద్దీ ఉం డే చంపాపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్,మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్గొండ ఆర్‌ఓ, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పని వేళలను 12వ తేదీ నుంచి పొడిగించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.

ఈ 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవసరమైతే పనివేళలను మరింత పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల రద్దీ పెరిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను గుర్తించి, అవసరానికి అనుగుణంగా అదనపు సమయాన్ని పెంచాలని మంత్రి సూచించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరిగే తహసీల్దార్ కార్యాలయాలను కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, వేగం, ప్రజలకు సౌకర్యం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పని చేస్తోందని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని నిర్ణయించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌లకు భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.