
అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఆర్‌సిబిపై జిటి నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్‌సిబి తొలుత 19.2 ఓవర్లలో 155 పరుగులు చేసి ఆలౌటైంది. జిటి జట్టు 15.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి గెలిచింది. ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పాటీదార్ ఔటైన్ తీరుపై వివాదం నెలకొంది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో బంతిని రజత్ పాటీదార్ లైగ్ సైడ్ కొట్టాడు. బౌండరీ దగ్గర జేషన్ హోల్డర్ బంతిని పట్టుకొని కిందపడ్డాడు. బంతి చేతిలో ఉన్నప్పడు నేలకు తాకంది. థర్డ్ ఎంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అధికారితో వాగ్వాదానికి కూడా దిగాడు. బంతిని పట్టుకున్న తరువాత నేలకు ఎలా తాకిన కూడా ఔట్ ఎలా ప్రకటిస్తారని ఆర్‌సిబి అభిమానులు మండిపడుతున్నారు.










