
అమరావతి: శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఒడిశావాసులు మృతి చెందారు. డివైడర్ ను దాటి అవతలి వైపు వస్తున్న లారీని వ్యాను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కొండతెంబూరు కూడలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.













