
సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని తనిఖీ కోసం టికెట్ స్క్వాడ్ ఆపాడు. అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం టికెట్ స్క్వాడ్ డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించి సదరు అధికారిని కండక్టర్ చెప్పుతో కొట్టాడు. ప్రయాణికులు దాడి చేశారు.












