హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో రీల్స్‌ చేసిన ఫేక్‌ పోలీసుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రీల్స్‌ చేసిన ఫేక్‌ పోలీసు నిఖిల్‌ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు యూనిఫాంతో సచివాలయంలో నిఖిల్‌ అనే యువకుడు రీల్స్‌ చేశాడు. పరారీలో ఉన్న నిఖిల్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు కేసులు ఉన్నట్లు సమాచారం. రీల్స్ కోసం పాత బస్తీలో పోలీస్ డ్రెస్ కొని సిఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానని, ఐపిఎల్ టికెట్స్ ఇప్పిస్తామంటూ నిఖిల్ వీడియోలు చేసినట్టు సమాచారం. ఏకంగా సిఎంనే కల్పిస్తానని ఇలాంటి చీటర్లు సెక్రటేరియట్ లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎత్తిచూపే వరకు ప్రభుత్వ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో అడుగుతున్నారు. సెక్రటేరియట్లో భద్రతా లోపం అనేది ఇది మొదటిసారి కూడా కాదు అని, ఫేక్ ఐడెంటిటీతో సెక్రటేరియట్లోకి ప్రవేశించిన సంఘటనలు చాలానే ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.