కరళలో కాంగ్రెస్ సారధ్య కూటమి గెలిచినా ఇప్పటీక ముఖ్యమంత్రి ఎవరు ? అనేది చిక్కుముడిగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం కెపిసిసి మాజీ అధ్యక్షులు మురళీధరన్‌తో చాలా సేపు సమావేశం అయ్యారు. తరువాత పలువురు పార్టీ నేతలతో కూడా భేటీ అయ్యారు. వెంటనే నాయకుడిని ఎంపిక చేయాలని ఈ సందర్భంగా రాహుల్ నిర్ణయించినట్లు వెల్లడైంది. మంగళవారం రాత్రి కానీ, బుధవారం ఉదయం కానీ ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది.పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకోగానే కేరళ విషయంపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది.

సిఎంగా ఒకరిని ఎంపిక చేసిన తరువాత విషయాన్ని మేడం సోనియా గాందీతో మాట్లాడి రాహుల్, ఖర్గే తుది నిర్ణయం ప్రకటిస్తారని మురళీధరన్ తెలిపారు. కేరళలో కాంగ్రెస్ సారధ్య యుడిఎఫ్ ఘన విజయం సాధించింది సిఎం పదవికి పోటీలో కాంగ్రెస్ నేతలు కెసి వేణుగోపాల్, సీనియర్ నేతలు విడి సతీశన్, రమేష్ చెన్నితాల ఉన్నారు. ముగ్గురికి హై కమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉండటంతో ఎవరు సిఎం అవుతారనేది సస్సెన్స్‌గా మారింది. కేరళ సిఎం ఎంపిక వ్యవహారంపై ఇప్పుడు సోనియా గాంధీ నివాసం 10 జనపథ్‌లో సందడి నెలకొంది.