కోల్ కతా : బెంగాల్ లో బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. పశ్చిమ బెంగాల్ తొలి బిజెపి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. సువేందుతో గవర్నర్‌ ఆర్ ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సిఎం పదవికి సువేందు మొదటి వ్యక్తి కావడం గమనార్హం. కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జెపి నడ్డా, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, ఎన్డియే పాలిత రాష్ట్రాల సిఎంలు, కేంద్రమంత్రులు  హాజరయ్యారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన అనంత‌రం మోడీ ఆశీస్సులు సువేందు తీసుకున్నారు.