
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వడగళ్ల వర్షం కురిసింది. ముఖ్యంగా శంషాబాద్-నాదర్గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో వడగళ్ల వాన పడింది. రోడ్లన్నీ వడగళ్లతో నిండిపోవడంతో, అచ్చం కశ్మీర్‌ను తలపించేలా మంచు కురిసిన భ్రమ కలిగించింది. ఈ అరుదైన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇవి హైదరాబాద్ హిమాలయాలు అంటూ చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రోడ్లన్నీ తెల్లటి మంచు ముక్కలతో నిండిపోవడం చూసి వాహనదారులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు విస్మయానికి గురవుతున్నారు.













