సూపర్‌స్టార్ మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ హీరో పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ భామ రషా తడాని హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటని విడుదల చేశారు. ‘మంగ.. మంగ’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రేవంత్ ఆలపించారు. ఇక సినిమా విషయానికొస్తే.. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి జివి ప్రకాశ్ సంగీతం అందించాడు. కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అశ్వినీదత్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాని పి కిరణ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.