
న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. లారా వోల్వార్డ్ జట్టుకు నాయకత్వం వహించనుంది. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ జట్టులో చోటు దక్కించుకుంది. 37 ఏళ్ల షబ్నిమ్ 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి.. తన నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకుంది. అలాగే, గత ఏడాది తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, జట్టులో చేరిన మాజీ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ కూడా అవకాశం ఇచ్చారు. వీరితోపాటు టాజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, క్లో ట్రయాన్, అయబోంగా ఖాకా వంటి పలువురు అనుభవజ్ఞులైన క్రీడాకారిణులకు జట్టులో చోటు దక్కింది.
దక్షిణాఫ్రికా మహిళల టీ20 జట్టు:
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్‌సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా (WK), మారిజాన్నే కప్ప్, అయాబొంగా ఖాకా, సునే లూస్, కరాబో మెసో (wk), నోన్‌కులులేకో మ్లాబా, కైలా చ్లోక్‌హుక్, కైలా చ్లోక్‌హుక్, నీకెర్క్.














