
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపి రాఘవ్ చద్దా శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా వేస్తూ.. ఆయనతో కలిపి ఏడుగురు సభ్యులు కూడా ఆప్ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆప్‌లో పూర్తి అవినీతి పరుల చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.
దీనిపై ఆప్ మొట్టమొదటి సరిగా స్పందించింది. రాఘవ్ కామెంట్స్‌పై ఆ పార్ట్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. రాఘవ్ చద్దా సహా మిగిత వారు పార్టీకి, పంజాబ్‌కు తీవ్ర ద్రోహం చేశారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని తమ పార్టీ చద్దాను ఎమ్మెల్యేగా, ఆపై ఎంపిగా తీర్చిదిద్దిందని, కానీ చివరకు ఆయన బిజెపి పంచన చేరాడని విమర్శించారు.











