
కరీంనగర్: హుస్నాబాద్ ఆర్ టిసి బస్ డిపో లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలను మంత్రి పొన్నం ప్రభాకర్ జరుపుకోవడం జరిగింది. మే డే వేడుకల్లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్ టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరిగింది. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులకు, శ్రమైక జీవులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరికీ పొన్నం కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో ఆర్ టిసి సిబ్బంది హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ సానుకూలత ను వినియోగించుకుంటూ ఎదగాలని రవాణా శాఖ పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని కార్మికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, కౌన్సిలర్ లు , ఆర్టీఏ మెంబర్ సూర్య వర్మ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, ఏసిపి సదానందం, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.













