
వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి
ఎవరెన్ని పన్నాగాలు పన్నినా.. మళ్లీ కెసిఆర్ సిఎం అవ్వడం ఖాయం
గుర్తింపు కోసమే సిఎం రేవంత్ విమర్శలు
యాక్టర్ల నుంచి యాంకర్ల వరకు ఆయనను గుర్తించడం లేదు: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా కొంతమంది తమకు సరైన గు ర్తింపు రావడం లేదనే కెసిఆర్ పట్ల విమర్శలు చే స్తూ కాలం వెల్లబుచ్చుతున్నారని బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ముఖ్యమంత్రి అ యిన తర్వాత కూడా యాక్టర్ల నుంచి యాంకర్ల వ రకు ఎవరూ కూడా తనను గుర్తు పట్టలేదన్న ఉ క్రోషంతోనే రేవంత్ రెడ్డి ప్రతిరోజు మాజీ సిఎం కె సిఆర్ పైన అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నార ని మండిపడ్డారు. కెసిఆర్‌ను ఏదో నాలుగు మాట లు అని పైశాచికానందం పొందితే వార్తల్లో వస్తామన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు, హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో కలిసి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మా ట్లాడుతూ, మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి పే రును గుర్తు పట్టక ఒక యాంకర్ శ్రీధర్ బాబు పేరు ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేశారు. యాక్టర్లు, యాంకర్లు మాత్రమే కాదు చివరికి ప్రజలు కూడా రేవంత్‌రెడ్డి పేరు ఎత్తడానికి సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు.
తెలంగాణ పైన మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయని, అన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుటిల ప్రయత్నాలు, తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేసినా ప్రజలు రానున్న శాసనసభ ఎన్నికల్లో కెసిఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌లో పార్టీ మారిన ఎంఎల్‌ఎ కనీసం తన సొంత గ్రామంలో సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేని పరిస్థితికి దిగజారిపోయారని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ ప్రాంతం లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి గులాబీ పార్టీలో చేరిన రఘుకి అభినందనలు తెలిపారు.















