శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో హైదరాబాద్‌కి చెందిన జవాను మృతి చెందారు. షోపియాన్ జిల్లాలోని జైనాపోరా సిఆర్పిపిఎఫ్ క్యాంప్‌లో సురీందర్ సింగ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం విధుల్లో ఉండగా ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. అధికారులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే లాభం లేకుండా పోయింది. సురీందర్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేవిధుల్లో స్పృహ కోల్పోయి.. హైదరాబాద్‌ జవాను మృతిశారు. సురీందర్ మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.