చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ ప్రమాణస్వీకారం చేశారు. విజయ్‌తో గవర్నర్‌ అర్లేకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా కెఎ సెంగొట్టియన్, పి వెంకటరమణ, ఆర్ నిర్మల్ కుమార్, రాజమోహన్, కె ప్రభు, సెల్విఎస్, కీర్తన ఎన్. ఆనంద్, ఆదవ ఆర్జున్ ప్రమాణస్వీకారం చేశారు. విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో నటి త్రిష స్సెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించారు. గత 59 సంవత్సరాలుగా ద్రవిడ పార్టీలు డిఎంకె, అన్నా డిఎంకె తమిళనాడు పాలిస్తూ వస్తున్నాయి. ద్రవిడయేతర ముఖ్యమంత్రిని ప్రజలు చూస్తున్నారు. తొలి సంకీర్ణ ప్రభుత్వంగా టివికె రికార్డుల్లోకెక్కింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.