
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టివికె పార్టీ ఓడిపోతుందనే అనుమానంతో నటుడు విజయ్ దళపతి అభిమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఓడిపోతాడనే అనుమానంతో అభిమాని కె మహేంద్రన్ (28) గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టివికె (106), డిఎంకె(67), అన్నాడిఎంకె(61) స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో అతడి పెద్ద పార్టీగా టివికె అవతరించింది. డిఎంకె కూటమి మూడో స్థానానికి పరిమితమైంది. ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌లు వెనుకంజలో ఉన్నారు. ట్విట్టర్‌లో యాస్ ట్యాగ్ లు ఎలక్షన్ రిజల్ట్, తలపతి, త్రిష, హిమంతాబుల్డోజడ్ కాంగ్రెస్, జన నయగన్ అనే ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.










