
తమిళనాడులో సిఎం విజయ్‌కు చాలాకాలంగా జ్యోతిష్యులుగా ఉన్న రాధన్ పండిట్ వెట్రివల్కు ప్రత్యేక గౌరవం కల్పించారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారి(రాజకీయాలు) ఒఎస్‌డిగా మంగళవారం నియమించారు. ఎన్నికలలో విజయ్ పార్టీ విజయం, ప్రభుత్వ స్థాపన తరువాత ఆయనకు ఈ స్థానం కల్పించారు. రాధన్ పండిట్‌కు జ్యోతిష్యం చెప్పడంలో మంచి పేరుంది. పలువురు రాజకీయ నాయకులకు ఆయన ఎప్పుడూ సరైన సలహాలు ఇస్తూ , నిర్ణయాలు తీసుకునేలా చేస్తూ వచ్చారు. ఈసారి ఎన్నికలో విజయ్ పార్టీ టివికె విజయం తధ్యం అని ఆయన జోస్యం చెప్పారు. విజయ్ ఈసారి తమ ప్రమాణస్వీకార ముహుర్తం కూడా ఈ జ్యోతిష్యుడి సూచనలను తూచా తప్పకుండా పాటించి ఖరారు చేసుకున్నాడు. విజయ్ రాజకీయ రంగప్రవేశం తరువాత ప్రతి నిర్ణయం కూడా ఈ జ్యోతిష్యుడి ఆదేశాల మేరకు పాటిస్తూ వచ్చాడు. ఆయననే ఇప్పుడు తన ఒఎస్‌డిగా ఏర్పాటు చేసుకున్నారు.












