విశాఖపట్నం: గాజువాకలో ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వికాస్‌నగర్‌లో జాకీల సహాయంతో ఇంటిని పైకి లేపే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో మరో ముగ్గరు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.