మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని, అం దులో భాగంగా ప్రతినెలా వెయ్యి కోట్లను విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వంద రోజుల్లో ప్రాధాన్యత క్ర మంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి ఉద్యో గ సంఘాల ప్రతినిధులకు హామీనిచ్చారు. శుక్రవారం ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సంఘాల జెఏసి నాయకులతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో టిజిఈజెఎసి నాయకులు మా రం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస రావు, టిజి ఈ జెఎసి చైర్మన్ లచ్చిరెడ్డి, శ్యామ్, ముజీబ్ హుస్సేనీ, లచ్చిరెడ్డి, దామోదర్ రెడ్డి, చావా ర వి, వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, మ ధుసూధన్ రెడ్డి, జి.నిర్మల, కె.రామకృష్ణ, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి,

ప్రజలకు మధ్య ఉద్యోగులు ఒక వారధిలా పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల గడప వద్దకు చేరుతున్నాయంటే, అందులో ఉ ద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆయన ప్రశంసించారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీలో సమగ్రంగా చర్చించి త్వరలోనే ఉద్యోగులకు చెబుతామని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను కూడా 100 రోజుల్లోనే ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు డిప్యూటీ సి ఎం హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా పి ఆర్‌సి నివేదికను తెప్పించుకొని అమలు చేస్తామని, ఈ విషయంలో ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన స్ప ష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.


ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు

కాగా, గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభు త్వం ప్రాధాన్యత ఇస్తుండటంపై సం ఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు అందుతున్నాయని, దీనివల్ల వేలాది కుటుంబాలకు ఊరట లభిస్తోందని వారు డిప్యూటీ సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ చెల్లించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా వెయ్యి కోట్లు కేటాయించడాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు స్వాగతించారు. భేటీ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పిఆర్‌సి, కరువు భత్యం (డిఏ), హెల్త్ కార్డ్ వంటి దీర్ఘకాలిక సమస్యలను డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈనెల 05వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్షలను చేపడుతామని జేఏసి నాయకులు ఇప్పటికే ప్రకటించగా ఈ రెండు రోజుల్లో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించిన తరువాత నిరాహార దీక్షలపై జేఏసి నాయకులు ముందుకెళ్లాలని అప్పటివరకు కార్యాచరణను వాయిదా వేయాలని డిప్యూటీ సిఎం భట్టి ఉద్యోగ సంఘాల జేఏసి నాయకులతో పేర్కొన్నారు.