రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. నిహారిక దాసరి నిర్మిస్తున్న చిత్రం ‘రాజా ది రాజా’. యువత తమ కలల కోసం పరుగులు తీయడం, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం వంటి అంశాలను అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ అద్భుతమైన టీజర్‌తో మేకర్స్ ఒకేసారి టాలెంటెడ్ యంగ్ హీరో ను, మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసినట్లయింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి పాల్గొన్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ “రిత్విక్‌కి సినిమా, యాక్టింగ్ అంటే చాలా ప్యాష న్. తను తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ అందుకుంటారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుత్విక్,విశాఖ ధీమన్, ని హారిక దాసరి, మంజు భార్గవి పాల్గొన్నారు.