
మేషం
మేష రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి. రుణాలు చాలా వరకు తీరుస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చూస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి, మొండిబాకీలు వసూలవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మరియు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. ప్రతిరోజు కూడా తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 7 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించండి. కార్యాలయాలలో పని ఒత్తిడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలావరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించండి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు కేసులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కుటుంబంలో సామాన్య వాతావరణం ఉంటుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. రాశి వారు ప్రతిరోజు హనుమాన్ వత్తలతో దీపారాధన చేయండి. ప్రతిరోజు నాగ సింధూరం నుదుటన ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధునం
మిధున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. నూతన పరిచయాలు వ్యాపార విస్తరణకు తోడ్పడతాయి మరియు ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో పై అధికారులతో ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులకు ఇది అనుకూలమైన రోజు. ఆరావళి కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి. ఇరుగుపొరుగు వారితో సఖ్యత పెరుగుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. డాక్యుమెంట్ల విషయంలో పురిటి విషయంలో జాగ్రత్త వహించాలి. శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా లభిస్తుంది. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు. జీవిత భాగస్వామి సలహాలు కలిసివస్తాయి. ఖర్చులు యధావిధిగా ఉంటాయి. ఉదర సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. మంగళవారం మరియు శుక్రవారం రోజున లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహం
సింహ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా చికాకు తో కూడిన వాతావరణం ఉంటుంది. సంతాన సంబంధమైన విషయ వివాహారాలలో చిన్నచిన్న ఒడిదుడుకులు ఉంటాయి. మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మరియు వ్యాపార రంగంలోని వారికి ఆశించిన లాభాలు అందుతాయి. పాత బాకీలు తీరిపోతాయి. వ్యాపార పరంగా లాభనష్టాలు సమానంగా ఉంటాయి. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకై ఖర్చు చేస్తారు. షూరిటీ సంతకాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. గృహంలో ఒక శుభకార్య చర్చ జరుగుతుంది. వారమంతా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆలోచించకుండా ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉంది. ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం చదవండి. మరియు మంగళవారం శుక్రవారం రోజున లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య
కన్యా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది మరియు చేపట్టిన పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. నీకున్న జరిగే దేనిలతో అందరిని ఒప్పిస్తారు. మిత్రుల సహాయంతో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. మీరు పనిచేస్తున్న కార్యాలయంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. ఏదైనా సాధించగలను అనే పట్టుదల మీలో పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తుల
తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ప్రతి పనిలో కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. భూ లేదా వాహన యోగం సూచిస్తోంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, అయితే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రతిరోజు కూడా అరటి నార వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు బ్రౌన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. దగ్గరి బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రేమ వివాహాలు కలిసి రావు. వ్యాపార పరంగా పోటీ వాతావరణం ఉన్నప్పటికీ మీదే పైచేయి అవుతుంది, కాబట్టి సహనంతో వ్యవహరించడం ముఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం కావచ్చు. ప్రభుత్వ సంబంధమైన లీజులు కాంట్రాక్టులు లభిస్తాయి. రుణంగా ఇచ్చిన ధనం తిరిగి చేతికి అందుతుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. కంటి సంబంధిత చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ప్రతిరోజు కూడా ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి లేదా వినండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ బుధవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు
ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో నూతన పెట్టుబడులు పెడతారు. మీరు ప్రారంభించిన వ్యాపారం లాభాల బాటలో సాగుతుంది. నర దిష్టి అధికంగా ఉంటుంది మెడలో కాలభైరవ రూపు ధరించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. పని విషయంలో కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఖర్చులు పెరిగినప్పటికీ దానికి తగ్గ ఆదాయం కూడా సమకూరుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంగళవారం మరియు శనివారం రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఆరావళి కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకరం
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంత కష్టపడినప్పటికీ ఫలితాలు అంతంత మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆస్తి తగాదాలు నూతన ఒప్పందాలతో పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూ సంబంధిత విష వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవాష్టకం ప్రతిరోజు చదవండి లేదా వినండి. కుటుంబ సభ్యులతో దేవదర్శనం చేసుకుంటారు. గో సేవ చేస్తారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు మెరున్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని అనుకూలంగా ఉన్నాడు. మీరు మొదలుపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మరియు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. పొదుపు పథకాలలో పెట్టుబడి పెడతారు. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు అనుకూలిస్తాయి. ఏదైనా ఒక శనివారం శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. విదేశీ ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉన్న వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పనులలో కొంత ఆలస్యం జరిగినా చివరకు విజయం సాధిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అవసరానికి తగినట్లుగా డబ్బు అందుతుంది కానీ అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కోట తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. బంధువులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.









