
హైదరాబాద్: ప్రముఖ నటుడు ఎన్టిఆర్ భుజానికి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయినట్లు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్లో తెలిపాయి. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయనకు అర్థోస్కోపిక్ సర్జరీని నిర్వహించినట్లు వెల్లడించాయి. ఎన్టిఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నాయి. రెండు, మూడు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్య బృందం తెలిపింది. ఇటీవల జిమ్లో కసరత్తులు చేస్తుండగా.. ఎన్టిఆర్ భుజానికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నారు.








