న్యూఢిల్లీ: ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య లోక్‌సభ మంగళవారం మరో రెండు బిల్లులను ఎలాంటి చర్చ లే కుండానే ఆమోదించింది. వీటిలో కేరళ పేరును ‘కేరళం’ గా మార్చే బిల్లు కూడా ఉంది. జూలై 20న ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. రెండు బిల్లులకు ఆమోదం లభించిన వెంటనే సభను మంగళవారానికి వాయిదా వేశారు.సోమవారం అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు, యువత ఆందోళనలపై చర్చకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తామని, పోలీ సు చర్యలపై కూడా అమిత్ షా సమాధానం ఇస్తారని ప్రకటించినప్పటికీ సభలో ప్రతిష్టంభన తొలగే పరిస్థితి కనిపించలేదు. జూలై 20న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించారనే ఆరోపణలపై అమిత్ షా స్పష్టంగా స మాధానం చెప్పాల్సిందేనని, సాధారణ అంశాలపై ఆయ న స్పందించడం వల్ల ప్రయోజనం ఉండదని సోమవార మే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అ ధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.

అయోధ్య రా మ మందిరానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం పై వచ్చిన ఆరోపణలపై చర్చ జరగాల్సిందేనని, ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ మరో డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. దీంతో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి.తొలుత సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడిం ది. వరుసగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సుదూర ప్రభావం చూపే మార్పులకు దారితీసే కీలక బిల్లులపై చర్చ జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా సాగకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అని బిర్లా అన్నారు. పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమైనందున సభలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని ప్రతిపక్ష సభ్యులను కోరారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ ప్లకార్డులతో వెల్‌లోకి వచ్చారు. ఈ గందరగోళం మధ్య సభాపీఠంపై ఉన్న టీడీపీ ఎంపీ తెనేటి కృష్ణ ప్రసాద్ పత్రాలను సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు.

ఆ రోజు సభా కార్యక్రమాల జాబితాలో అమిత్ షా పేరుతో రెండు బిల్లులు ఉన్నప్పటికీ ఆయన సభకు హాజరు కాలేదు.తర్వాత కేరళ (పేరు మార్పు) బిల్లు-2026ను పరిశీలన, ఆమోదం కోసం సభ ముందుకు తీసుకొచ్చారు. రాష్ట్ర పేరును ‘కేరళం’గా మార్చడం ఈ బిల్లు ఉద్దేశం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య ఎలాం టి చర్చ లేకుండానే సభ్యుల మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ‘కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రం పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తోంది’ అని నిత్యానంద్ రాయ్ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కేరళ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ కె.సి.వేణుగోపాల్ ఈ బిల్లుపై మాట్లాడలేకపోవడం బాధాకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఆ తర్వాత సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొ హోల్ జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (సవరణ) బిల్లు-2026ను ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఈ బిల్లును కూడా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు.


ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

దేశవ్యాప్తంగా వివిధ ట్రైబ్యునల్స్ కు చైర్‌పర్సన్లు, సభ్యులను ఎంపిక చేసేందుకు జాతీయ ట్రైబ్యునల్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు-2026కు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం రాజ్యసభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడేందుకు సభాపతి అనుమతి ఇవ్వకపోవడంతో వారు వాకౌట్ చేశారు. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ, సత్వర న్యాయం అందించడంలో ట్రిబ్యునళ్లు కీలకమైన అనుబంధ వ్యవస్థగా పనిచేస్తాయని చెప్పారు.