
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర సర్వీసుల నుంచి సీనియర్ ఐఏఎస్ సంజయ్‌జాజును రిలీ వ్ చేస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ సిఎస్ రేసులో సంజయ్‌జాజు కూడా ఉన్నారు. అయితే, ప్రస్తు త సిఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈనెలాఖరుతో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే రామకృష్ణారావుకు మరో రెండు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల నుంచి సీనియర్ ఐఏఎస్ సంజయ్‌జాజును మంగళవారం రిలీవ్ చేయడంతో సంజయ్‌జాజే సిఎస్‌గా అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ సంజయ్‌జాజును రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు
ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం సిఎస్ రేసులో ఉన్న సీనియర్ ఐఏఎస్‌లు (1992 బ్యాచ్‌కు) చెందిన వారు ఉన్నారు. 1992 బ్యాచ్‌కు చెందిన వారిలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లు ఉండగా అందులో సంజయ్‌జాజు (బిఈ మెకానికల్, ఎంటెక్ చదవగా), 26.02.1969లో ఆయన జన్మించారు, ఆయన 11.10.1992లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఇక, వికాస్‌రాజ్ (బిటెక్, ఐఐటీ కాన్పూర్, ఎంబిఏ చదవగా), 31.03.1968లో జన్మించారు. 24.12.1992లో వికాస్‌రాజ్ ఐఎఎస్‌కు ఎంపికయ్యారు. వీరితో పాటు జయేశ్‌రంజన్ (బిఏ, ఎంబిఏ) చేయగా, 25.09.1967లో జన్మించారు. 11.10.1992లో ఆయన ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.












