
5115 articles

న్యూయార్క్: అమెరికాలోని ఓ ఆంధ్రా యువతి అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. ఆంధ్ర్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన పిట్ట లోకేశ్వరి(28) గత కొంతకాలంగా లుకేమియా వ్యాధితో బాధపడుతోంది. లుకేమియా శృతిమించడంతో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఆమె సొంతగ్రామం పిట్టువారిపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి. నార్త్ వెస్ట్ మిస్సోరి స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. యువతి మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీశైలం ప్రాజెక్టు లో తగ్గుతున్న నీటిమట్టం విద్యుత్తు ఉత్పత్తిని నిలిపిన అధికారులునవతెలంగాణ-అచ్చంపేట(నీలం సంజీవ రెడ్డి సాగర్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నదిపై నల్లమల కొండలలో నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు. ఇది 512 మీటర్ల పొడవు, 145 మీటర్ల ఎత్తుతో, 12 రేడియల్ క్రస్ట్ గేట్లతో నిండిన జలాశయం. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి (770 MW + 900 MW) మరియు ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం పనిచేస్తుంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాల సరిహద్దులో ఉంది. […] The post అడుగంటుతున్న కృష్ణమ్మ appeared first on Navatelangana.


వేసవి వచ్చిందంటే చాలు చాలామంది పుచ్చకాయను తినడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు, ఈ పండు చల్లదనాన్ని, శరీరానికి తేమను అందిస్తుంది. దీనిలో సుమారు 90 శాతం నీరు ఉంటుంది. కాబట్టి, వేసవిలో ప్రతిరోజూ పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవచ్చు. చాలామంది పుచ్చకాయను అనేక విధాలుగా తింటుంటారు. కొందరు దీనిని ఉప్పుతో తినడానికి ఇష్టపడతారు. మరికొందరు దీనిని ఉప్పుతో తినాలా వద్దా అని సందేహిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం..పుచ్చకాయను ఉప్పుతో అస్సలు తినకూడదు. పుచ్చకాయ రుచిని పెంచడానికి ఉప్పుతో తింటున్నట్లయితే ఆ అలవాటును వెంటనే మానుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే ఏ పండులోనైనా ఉప్పు కలపడం దాని పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను దూరం చేస్తుంది. ఇదే విషయం పుచ్చకాయకు కూడా వర్తిస్తుంది. పుచ్చకాయను వెంటనే కోసి, ఉప్పు లేకుండా తినాలి. దీనివల్ల శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయని చెబుతున్నారు. పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 1. పుచ్చకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా పుచ్చకాయ తినడ

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవోనవతెలంగాణ-కాటారం కాటారం ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన డి. రవీందర్ బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్డీవో రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజలకు పారదర్శకంగా మరియు వేగవంతమైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆర్డీవో […] The post కాటారం ఆర్డీవోగా డి. రవీందర్ appeared first on Navatelangana.

కర్నూలు: ఆస్పర్జిల్లోసిస్ అనే ఫంగస్ రియల్ గా అయితే ఇలా ఉంటుంది.. ఎక్స్ రేలో కనపడిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ ఫంగస్ లాగే ప్రమాదకరమైనది. ఇది నిదానం గా పెరిగి ఆ ఊపిరితిత్తులు లో క్యావిటీనంత ఆక్రమించుకొని దగ్గు కలుగజేసి రక్తం హీమాప్టైసిస్ ద్వారా ప్రాణాలను తీస్తుంది. ఈరోజు 70 ఏళ్ల పేషెంట్ కు ఆపరేషన్ చేశాము. ఈ సర్జరీకి 5 గంటల సమయం పట్టింది. అతి క్లిష్టమైన ఊపిరితిత్తులు ఆపరేషన్ కుడివైపు అప్పర్ లోబెక్టమి చేశాము. పేషెంట్ బాగున్నాడు కాకపోతే మాకే నడుములు మెడ నొప్పులు వచ్చాయి. పేషెంట్ బాగయితే అంతా మరిచిపోతాము.ఇటువంటి ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రులలో రెండు వందలకు పైగా చేసి ఉంటాను. మూడు నుంచి ఐదు లక్షల పైన ఖరీదైన ఈ ఆపరేషన్ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్ టిఆర్ వైద్యసేవ కింద ఉచితంగా చేయబడుతుంది. దీనికి ప్యాకేజీ చాలా తక్కువగా ఉండడం వలన బయట ఆసుపత్రులలో చేయరు. ఇంకో సంవత్సరం మాత్రమే నాకు సర్వీస్ ఉంది. తర్వాత రిటైర్ అయిపోతాను కావున ఎవరైనా అవసరం ఉంటే తొందరగా చూపించుకోగలరు.డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు


వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మండే ఎండ, తీవ్రమైన వేడి శరీరం నుండి తేమను పూర్తిగా హరించివేస్తాయి. ఇటువంటి పరిస్థితిలో, డీహైడ్రేషన్ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా, తేమగా ఉంచే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఎండుద్రాక్ష, సోంపు నీరు తాగాలని సూచిస్తున్నారు. ఎండుద్రాక్షలో ఇనుము, సహజ చక్కెర, పీచుపదార్థం, కాల్షియం, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అంతేకాదు, రక్తహీనతను తొలగించి బలహీనతను తగ్గిస్తుంది. ఇక సోంపులో కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు, శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ రెండింటినీ రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తాగినప్పుడు, అది శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇప్పుడు ఎండుద్రాక్ష, సోంపు నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. శరీరాన్ని చల్లబరుస్తుంది: సోంపు చల్లదనాన్నిచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, దాని నీరు వేసవి



హైదరాబాద్: లేడీస్ హాస్టల్ లో లిఫ్ట్ లో ఇరుక్కొని ఐదేళ బాలిక మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గౌలిదొడ్డిలోని ఓ లేడీస్ హాస్టల్ పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ కుటుంబం వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది. గ్రిల్ లిఫ్ట్ లో బాలిక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఐదో ఫ్లోర్ వెళ్లింది. మూడో ఫ్లోర్ లో చిన్నారి జుట్టు ఇరుక్కుపోవడంతో తల మొత్తం నుజ్జు నుజ్జుగా మారి చనిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని పరీక్షించిన వైద్య సిబ్బంది తెలిపారు. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా చాలా మంది తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే బైక్‌లను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. రోడ్లు తరచుగా అధ్వాన్నంగా, ఎగుడుదిగుడుగా ఉండే గ్రామీణ వినియోగదారులకు ఈ అవసరం మరింత కీలకంగా మారింది. అందువల్ల దృఢమైన బాడీ, తక్కువ నిర్వహణ ఖర్చు, అద్భుతమైన మైలేజీనిచ్చే బైక్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో రోజువారీ ఉపయోగం కోసం మార్కెట్లో అనేక బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మోటార్‌సైకిళ్లు 100cc లేదా 110cc ఇంజన్‌లతో వస్తాయి. ఈ ఇంజన్లు తక్కువ పెట్రోల్‌ను వినియోగించి, ఎక్కువ కాలం పాటు నమ్మకమైన పనితీరును అందిస్తాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ దాని బలమైన ఇంధన సామర్థ్యం, శక్తివంతమైన ఇంజన్‌కు ప్రసిద్ధి చెందింది. లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ.76,000 నుండి ప్రారంభం కాగా, ఆన్-రోడ్ ధర సుమారుగా రూ.90,000 వరకు ఉంటుంది. హోండా షైన్ రెండవ స్థానంలో హోండా షైన్ నిలిచింది. దూర ప్రయాణాల కోసం ఈ బైక్ సౌకర్యవంతంగా ఉంటు


నవతెలంగాణ-హైదరాబాద్: ఐఆర్‌జీసీ(Islamic Revolutionary Guard Corps)కి చెందిన పలువురు సముద్ర తీరంలోని బిబియన్ ద్వీపం గుండా తమ భూభాగంలోకి చొరబడి, అలజడులకు కుట్రలు చేశారని, నలుగురిని అరెస్ట్ చేసినట్లు కువైట్ పేర్కొంది. ఈ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. కువైట్ మాటలు అవాస్తవమని, ఆధారాలులేనివని ఇరాన్ మీడియా తన్సీయం పేర్కొంది. కువైట్ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని, పొరుగు దేశాల సార్వభౌమాత్వాన్ని ఇరాన్ ఎల్లప్పుడు గౌరవిస్తోందని ఇరాన్ విదేశాంగ తెలిపింది . ఇకపై కువైట్ అధికారులు “తొందరపాటు వ్యాఖ్యలు, […] The post కువైట్ ఆరోపణలను ఖండించిన ఇరాన్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌనునల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నార్మల్ డైరీని గట్టేక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మొదటి విడతగా రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలసీతలీకరణ కేంద్రం వద్ద భారీ గజమాలతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలేర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల […] The post ఎంఎల్ఏ బీర్ల ఐలయ్యకు గజమాలతో సన్మానం appeared first on Navatelangana.

మహబూబ్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక కలెక్టరేట్ సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బొల్తా పడడంతో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మీరు రూ. 30 వేల బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్! ఈ రేంజ్ లో ఆమోలెడ్ డిస్‌ప్లేలు, శక్తివంతమైన బ్యాటరీలతో కూడిన మూడు అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ మోడల్స్ ఏవి? వాటి ధర ఎంతో చూద్దాం. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6వన్‌ప్లస్ నుండి వచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.5K ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 8000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 వివో టి5 ప్రో 5జి ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లో 6.83-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 9020mAh బ్యాటరీ ఉన్నాయి. భారత టెక్ మార్కెట్లో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. రెడ్‌మి నోట్ 15 5G 5520mAh బ్యాటరీతో వచ్చే ఈ పరికరం 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.24,999 ధరతో లభిస్తుంది. ఈ రెడ్‌మి

కూకట్ పల్లి: మహిళా కానిస్టేబుల్ ను ఎస్ఐ ప్రేమపేరుతో మోసం చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు ఎస్ఐని సస్పెండ్ చేశారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ లో 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సీ సురేష్ కుమార్ ఎస్సె గా పని చేస్తున్నారు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ తో పరిచయం కావడంతో ఇద్దరు మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళ కానిస్టేబుల్ ను ఎస్ఐ శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో ఏవో సాకులు చెబుతూ తప్పించుకున్నాడు. ఈ మధ్య పెళ్లి విషయంలో ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీంతో ఎస్సై సురేష్ తనను మోసం చేయడానికి యత్నిస్తున్నట్లు అనుమానించిన మహిళా కానిస్టేబుల్ గట్టిగా నిలదీసింది. దీంతో ఆమెపై సురేష్ ఎదురుతిరిగాడు. పెళ్లి చేసుకోవడం కుదరదని సురేష్ తేల్చి చెప్పాడు. దీంతో అతనిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే స
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో వ్యవసాయం, ఇంధనం, మౌలిక వసతుల రంగాలకు ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026-27కు కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాల కోసం భారీగా రూ.2.6 లక్షల కోట్లను కేటాయించింది. దేశీయ బొగ్గును గ్యాస్, యూరియా, ఇతర పారిశ్రామిక రసాయనాలుగా మార్చే లక్ష్యంతో రూ.37,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకానికి కూడా కేబినెట్ ఆమోదం […] The post కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు appeared first on Navatelangana.
– జుక్కల్ ఎంపీడీవో , ఎంపీవో నవతెలంగాణ – జుక్కల్మండలంలోని కౌలాస్ నళా ప్రాజెక్ట్ ఆయకట్టు కింద ఉన్న రైతులు గ్రామాల ప్రజలు పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సందర్భంగా కౌలాస్ నాళా ప్రాజెక్ట్ స్పిల్‌వే గేట్ల మరమ్మత్తు పనుల నిమిత్తం రేపు అనగా 14-05-2026 తేదీన మధ్యాహ్నం సుమారు 1:00 గంటల నుండి స్పిల్‌వే గేట్ల ద్వారా నీటి విడుదల […] The post కౌలాస్ నాలా ప్రాజెక్ట్ దిగువ ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.