దేశవ్యాప్తంగా మే 21 నుంచి 23 వరకు జరగనున్న “ట్రక్ చక్కా జామ్” ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది. డీజిల్-నేషనల్ కమిటీ ఆధ్వర్యంలో, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో ఈ నిరసనలు నిర్వహించనున్నారు.

పెరిగిన ECC ఛార్జీలు, డీజిల్ వాహనాలకు ప్రతి నాలుగేళ్లకు తప్పనిసరి ఫిట్‌నెస్ టెస్టులు, యూరో-6 వాహనాలకు ECC పరీక్షలను వ్యతిరేకిస్తూ దేశంలోని 62 ప్రాంతాల రవాణా సంస్థలు ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. AIMTC దక్షిణ మండల ఉపాధ్యక్షుడు వై.వి. ఈశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయాలు రవాణా రంగంపై తీవ్ర భారం మోపుతున్నాయని అన్నారు.