ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంధన సంరక్షణ పిలుపును అనుసరిస్తూ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అద్దంకి పర్యటనలో ఎస్కార్ట్, కాన్వాయ్ వాహనాలను పక్కనపెట్టి స్వయంగా తన కారులో ప్రయాణించారు.
ఈ చర్యపై అధికారులు, ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేస్తూ ఇంధన పొదుపు, ప్రభుత్వ వనరుల బాధ్యతాయుత వినియోగానికి ఇది మంచి సందేశమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావంతో ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని, ప్రజలు విద్యుత్ పొదుపు పాటిస్తూ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని మంత్రి సూచించారు.
సంతమాగులూరు మండలంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార సమావేశంలో పాల్గొన్న మంత్రి, 84 మంది లబ్ధిదారులకు రూ.69.16 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.














