ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం వారణాసిలో పర్యటించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు, 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘సేవా సంకల్ప్ అభియాన్‌’లో పాల్గొన్నారు. అనంతరం కాశీ విశ్వనాథ ఆలయంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. భారత్ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ఎన్డీయే ఐక్యత ప్రాధాన్యమని చంద్రబాబు పేర్కొన్నారు.