విశాఖలో ఎబోలా వైరస్ అలర్ట్ కలకలం రేపుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్ట్, అలాగే ఆంధ్రా మరియు గీతం యూనివర్సిటీలలో నిఘా పెంచారు.
ఎబోలా ప్రభావిత దేశాలైన కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ ఛాతీ మరియు అంటువ్యాధుల ఆసుపత్రిలో 30 పడకల ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. సింగపూర్ నుంచి వచ్చిన Scoot Flight ప్రయాణికులందరికీ ఇప్పటికే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ప్రయాణికులు తమ ట్రావెల్ హిస్టరీ వివరాలతో సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ సమర్పించాల్సి ఉంటుంది.
ఎబోలా లక్షణాల్లో జ్వరం, గొంతు నొప్పి, చలి, తీవ్రమైన శరీర నొప్పులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.అయితే ఇప్పటివరకు విశాఖలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.










