అమెరికా కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగులపై ఖర్చు చేసే మొత్తాన్ని ఇంకా అధిగమించలేదని ర్యాంప్ AI ఇండెక్స్ తాజా నివేదిక వెల్లడించింది. AIని విస్తృతంగా ఉపయోగిస్తున్న టాప్ 1 శాతం సంస్థలు ప్రతి ఉద్యోగిపై నెలకు సుమారు 7,500 డాలర్లు AI టూల్స్, కంప్యూటింగ్ కోసం ఖర్చు చేస్తున్నాయి. అయితే ఇది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సగటు నెలవారీ వేతనం అయిన 16,000 డాలర్ల కంటే తక్కువే.
టాప్ 10 శాతం కంపెనీలు ఉద్యోగికి 611 డాలర్లు ఖర్చు చేస్తుండగా, సాధారణ సంస్థలు కేవలం 11 డాలర్లకుపైగా మాత్రమే వెచ్చిస్తున్నాయి. అయినప్పటికీ AIపై పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అత్యధికంగా AI వినియోగిస్తున్న సంస్థల్లో గత నెలలో ఖర్చు 14 శాతానికి పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది.











