భారతదేశంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) రంగం రానున్న మూడు సంవత్సరాల్లో రూ.75 వేల కోట్లకు చేరుకుని, అనంతరం రూ.1 లక్ష కోట్ల మార్క్‌ను దాటుతుందని మాజీ IAS అధికారి, భారత CSR విధాన రూపకర్తల్లో ఒకరైన డా. భాస్కర్ చటర్జీ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన "CSR Meets the Social Stock Exchange: A Journey Ahead" అనే నాలెడ్జ్ సెషన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. EQUIPPP ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో CSR రంగ నాయకులు సామాజిక కార్యక్రమాలకు నూతన నిధుల సమీకరణ మార్గాలపై చర్చించారు.
ఈ సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ త్వరలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ (SSE)లో లిస్టింగ్‌కు సిద్ధమవుతోందని ప్రకటించింది. అలాగే ప్రివెంటివ్ ఆంకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, 100 శాతం AI ఆధారిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లు ప్రారంభించడం, దేశవ్యాప్తంగా క్యాన్సర్‌తో పాటు నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCDs) స్క్రీనింగ్ సేవలను విస్తరించడం వంటి ప్రతిష్ఠాత్మక ప్రణాళికలను వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు, CSR నిధులను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సామాజిక సేవలకు వినియోగించడంలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.














