నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో మరోసారి ఉగ్రవాదుల దాడి కలకలం రేపింది. అనుమానిత ఇస్లామిస్ట్ మిలిటెంట్లు ఒక పాఠశాలపై దాడి చేసి దాదాపు 42 మంది పిల్లలను అపహరించినట్లు అధికారులు తెలిపారు.

ఆస్కిరా-ఉబా ప్రాంతంలోని ముస్సా ప్రైమరీ అండ్ జూనియర్ సెకండరీ స్కూల్‌లో తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 32 మంది విద్యార్థులను స్కూల్‌ నుంచే తీసుకెళ్లగా, మరో 10 మందిని సమీప ఇళ్ల నుంచి కిడ్నాప్ చేసినట్లు సమాచారం.

ఈ ప్రాంతం గతంలో కూడా బోకో హరామ్ ఉగ్రవాదుల దాడులతో వార్తల్లో నిలిచింది. 2014లో చిబోక్ పట్టణం నుంచి 270 మందికి పైగా బాలికలను అపహరించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.