తమిళ చిత్ర పరిశ్రమకు ఊరటనిచ్చేలా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలో విడుదలయ్యే ప్రతి కొత్త తమిళ సినిమాకు తొలి ఏడు రోజుల పాటు రోజుకు ఐదు షోలను ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. దీనికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక పర్మిషన్ అవసరం లేదని స్పష్టం చేశారు.
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానుల నిర్ణయంతో అదనపు షోలు వేయొచ్చని తెలిపారు. ఈ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కోలీవుడ్ ప్రముఖులు విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. యాక్షన్ హీరో విశాల్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “సినిమా పరిశ్రమ సమస్యలను అర్థం చేసుకుని తీసుకున్న అద్భుత నిర్ణయం” అంటూ విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తమిళ సినీ పరిశ్రమకు కొత్త ఊపునిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.












