తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్ ఇటీవల ఓ మీడియా ఈవెంట్‌లో అసౌకర్యకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. హీరో విజయ్‌, నటి త్రిష గురించి అడిగిన ప్రశ్నలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “మీరు ఏలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు?” అంటూ అక్కడికక్కడే రిపోర్టర్లకు కౌంటర్ ఇచ్చారు.

అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై మాళవిక ఎక్స్‌లో స్పందించారు. “కొంతమంది జర్నలిస్టులు అవసరం లేని, సంచలనాత్మక ప్రశ్నలు అడిగారు” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్‌తో తనకు ఏడు సంవత్సరాలుగా స్నేహం ఉందని, ఆయనపై ఎంతో గౌరవం ఉందని తెలిపారు. భవిష్యత్తులో మీడియా ఇంటరాక్షన్స్ మరింత గౌరవప్రదంగా ఉండాలని కోరారు. ఈ ఘటనపై నెటిజన్లు మాళవికకు మద్దతుగా నిలిచారు.