ప్రముఖ కే-పాప్ గ్రూప్ బ్లాక్‌పింక్ (BLACKPINK) సభ్యురాలు లిసా మరోసారి డేటింగ్ రూమర్లతో వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె పేరు థాయ్ నటుడు బ్లూ పొంగ్తివాట్ (Blue Pongtiwat)తో కలిసి వినిపిస్తోంది. ఇద్దరూ థాయ్‌లాండ్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాల్లో కలిసి కనిపించారనే వార్తలతో సోషల్ మీడియాలో ఈ ఊహాగానాలు వేగంగా వ్యాపించాయి.

ఈ ఏడాది జరిగిన లిసా 29వ పుట్టినరోజు వేడుకలకు బ్లూ హాజరైనట్లు సమాచారం. లిసా ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, అనంతరం బ్లూ కూడా ఇద్దరూ కలిసి ఉన్న చిత్రాలను పోస్ట్ చేయడంతో డేటింగ్ వార్తలకు మరింత ఊతం లభించింది.

అయితే ఇప్పటివరకు లిసా గానీ, బ్లూ పొంగ్తివాట్ గానీ ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. ఇద్దరూ చాలా కాలంగా స్నేహితులని, కేవలం కలిసి కనిపించినంత మాత్రాన డేటింగ్‌లో ఉన్నారని నిర్ధారించలేమని అభిమానులలో కొందరు అభిప్రాయపడుతున్నారు.

బ్లూ పొంగ్తివాట్ పూర్తి పేరు పొంగ్తివాట్ టాంగ్వాన్‌చారోయెన్. ఆయన థాయ్‌లాండ్‌కు చెందిన నటుడు, గాయకుడు, మోడల్. Ready, Set, Love, Intern in My Heart, You Are My Heartbeat, Love and Run వంటి ప్రాజెక్ట్‌లతో ఆయన మంచి గుర్తింపు పొందారు.