అమెరికాలోని Triangle Area Telugu Association (TATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టాటా తెలుగు బడి’లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ప్రవాస భారతీయ తెలుగు కుటుంబాల పిల్లలకు తెలుగు భాషతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయాలనే లక్ష్యంతో గత 12 ఏళ్లుగా ఈ తెలుగు బడి విజయవంతంగా కొనసాగుతోంది.
ఈ ఏడాది కూడా విద్యార్థుల కోసం ఐదు స్థాయిలలో తరగతులను నిర్వహించనున్నారు. ప్రారంభం, ప్రవర్తన, ప్రథానం, ప్రవాహం, ప్రవేశం అనే విభాగాల్లో విద్యార్థులకు బోధన అందించనున్నారు. ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు.
కేరీ ప్రాంతంలోని Davis Drive Elementary School, హోలీ స్ప్రింగ్స్‌లోని Zebra Robotics కేంద్రాల్లో తెలుగు బడి తరగతులు జరుగనున్నాయి.
మే 16వ తేదీ వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 230 డాలర్ల ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ఫీజులోనే పాఠ్యపుస్తకాలు, స్నాక్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

















